18-09-2025 11:54:16 PM
సనత్‌నగర్ (విజయక్రాంతి): నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షంతో బల్కంపేట్–బేగంపేట్ బ్రిడ్జి సబ్‌వే పూర్తిగా నీటితో నిండిపోయింది. ఈ సందర్భంగా బల్కంపేట్ వైపు నుంచి ఒక వ్యక్తి బైక్‌పై వచ్చి సబ్‌వే మధ్యలో నీటిలో ఇరుక్కుపోయాడు. హెల్మెట్ ధరించి ఉన్న ఆ వ్యక్తి ప్రాణభయంతో “హెల్ప్ మీ… హెల్ప్ మీ…” అంటూ అరిచాడు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్.ఐ. శ్రీరాములు తక్షణమే స్పందించారు. తన యూనిఫార్మ్ తొలగించి, బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకి ఆ వ్యక్తిని రక్షించేందుకు అపారమైన కృషి చేశారు. అయితే ఈ ప్రయత్నంలోనే ఆయనకు అనుకోని విషాదం తలెత్తింది. బయటకు తీసుకువచ్చి సిపిఆర్ (CPR) చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రాణాలను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసినా చివరికి ఆయనే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాన్ని పణంగా పెట్టి సేవ చేసిన ఎస్.ఐ. శ్రీరాములు వీరోచిత త్యాగం అందరినీ కదిలించింది.