18-09-2025 11:28:20 PM
ప్రతివాదులుగా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, సబ్ కలెక్టర్, పలు శాఖల అధికారులు
సామాజిక వేత్త రాజ్ గోపాల్ సార్డా పిటిషన్..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు అన్యాక్రాంతంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై(ఎన్‌జీటీ)లో ఫిర్యాదు దాఖలు అయింది. తాండూరు సిటీజన్స్ వెల్ఫేర్ సోసైటీ(టీసీడబ్ల్యూఎస్) అధ్యక్షులు, సామాజికవేత్త రాజ్ గోపాల్ సార్డా ఈ పిటిషన్ దాఖలు చేశారు. గొల్ల చెరువు అన్యాక్రాంతం... కుంచించుకుపోతున్న అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రం ముఖ్య కార్యదర్శి, తాండూరు సబ్ కలెక్టర్, ఇరిగేషన్, తహసీల్దార్లు, పురపాలక సంఘం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ప్రతివాదులుగా చేర్చినట్లు రాజ్ గోపాల్ సార్డా గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గొల్ల చెరువులో కబ్జాలను తొలంగించే వీలు కాని పక్షంలో పట్టణంలో ఇదివరకే ఉన్న పాతకుంట, గొల్ల చెరువుల సమానమైన కృతిమ సరస్సు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని చెప్పారు. గొల్ల చెరువు, మల్ రెడ్డిపల్లి చెరువుల్లో మురుగు నీరు ప్రవహించకుండా అడ్డుకట్ట వేయాలని, గొల్ల చెరువు బఫర్ జోన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి కట్టడాలు అనుమతించరాదని, డంపింగ్ ను కూడా అరికట్టాలని ఆయన ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు.