18-09-2025 11:51:37 PM
మంగపేట (విజయక్రాంతి): ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి(Constituency Incharge Bade Nagajyothi) మండలంలోని కమలాపురం గ్రామంలో గురువారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ ఇటీవలే మృతిచెందగా వారి స్వగృహంలో జరిగిన దశదినకర్మలకు హాజరై చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కమలాపురం గ్రామ యూత్ అధ్యక్షులు ఎల్లంకి (డీజే) రాజేష్ భార్య ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను నాగజ్యోతి పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్ మాజీ జడ్పీటీసీ తుమ్మల హరిబాబు మాజీ ఎంపీపీ నాగేష్ సొసైటీ డైరెక్టర్ సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు గోస్కుల లక్ష్మి చల్లగురుగుల తిరుపతి హైదర్ బుట్టో మండల రవీందర్ గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కాని శ్రీనివాస్ ఉడుగుల శ్రీనివాస్ యాదవ్ పార్వతి జెట్టి లక్ష్మి బీసి సాంబయ్య గుడివాడ శ్రీహరి పాల్గొన్నారు.