18-09-2025 11:58:30 PM
నాగారం: నాగారం మండలం నాగారం గ్రామంలో వీధిలైట్ల సమస్యతో బాధపడుతున్న గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, వెలుగులతో ఉండాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samuel) సహకారంతో వచ్చిన ఐమాక్స్ లైట్లను బీసీ కాలనీలో ప్రారంభించారు. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కన్నెబోయిన వెంకట బిక్షం, గ్రామ శాఖ అధ్యక్షులు మంగదుడ్ల దశరథ, టిపిసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొలిపాక సాయికుమార్, సీనియర్ నాయకులు అనంతుల వెంకటయ్య, గద్దల సైదులు, చిప్పలపల్లి అంజయ్య, భైరబోయిన సత్తయ్య, బొబ్బిలి ఎర్రయ్య, గ్రామస్తులు సోమయ్య, కనకయ్య, అంజయ్య, మల్లయ్య, అవిలయ్య, అరుణ్, గణేష్, జంపి, తదితరులు పాల్గొన్నారు.