calender_icon.png 19 September, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియా, డీఏపీ రైతులకెంతో ఉపయోగకరం

18-09-2025 11:48:52 PM

33వ ప్రాక్టికల్ సెషన్ లో మండల వ్యవసాయాధికారి అనిల్..

ఆళ్ళపల్లి (విజయక్రాంతి): నానో యూరియా అలాగే డీఏపీ రైతులకు ఎంతో ఉపయోగాలున్నాయని మండల వ్యవసాయాధికారి అనిల్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నానో డీలర్లకు ప్రాక్టికల్ సెషన్ నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా రైతులు డ్రోన్ లు ద్వారా పిచికారి విధానాలు దాని వలన ప్రయోజనాలపై అవగాహన కలిగించడం జరిగింది. అనంతరం ఇన్పుట్ డీలర్ నరెడ్ల శ్రీను ఆయిల్ ఫామ్ లో అంతర పంటగా వేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఫెసిలిటేటర్ డేవిడ్ రాజ్ జయపాల్ నుంచి మెమెంటో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ కార్యాలయ సిబ్బంది వంశీ తాళ్లపల్లి నాగేశ్వర్రావు, బూర్ణ రాంబాబు, బోడ, లఖపతి, గుండెబోయిన యాకరాజు తదితరులు పాల్గొన్నారు.