19-09-2025 12:30:32 AM
నిజామాబాద్ లీగల్ కరస్పాండెంట్, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీల అనాధికార ఆధిపత్యానికి, సామాజిక వెలివేతలకు, అణచివేతలకు గురైన బాధితులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గడప తొక్కి ’న్యాయం’ కోసం అర్థిం చిన విదంగానే కొన్ని విడిసిలు ప్రభుత్వ భూములను అక్రమంగా అక్రమించి భవనాలు, గిడ్డంగులు, వాణిజ్య సముదా యాలు,
కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హల్ లు నిర్మించి వాటిని అద్దెకు ఇచ్చి ఆ అద్దెను విడిసిలు తమ ఖాతాలో వేసుకుంటున్నాయనే అనేక పిర్యాదులు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చెంతకు చేరిన నేపథ్యంలో విడిసిల వ్యవహారంపై పూర్తిసా యిలో విచారణ జరిపి నివేదికలు అందజేయాలని ఆయా గ్రామ పంచాయతీ కార్యద ర్శులు, మండల అభివృద్ధి అధికారులు,
తహసీల్దార్లకు సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఫిర్యాదుల పత్రాలను పంపించారు.సదరు ఆదేశాలకు అనుగుణంగా విచారణ నిర్వహించిన గ్రా మాల పంచాయతీ అధికారులు ,నీటి పారుదల శాఖ అధికారులతో, మండల అభివృద్ధి అధికారులు, మండల తహసీల్దార్లు సమన్వయం చేసుకుని పూర్తిస్థాయి నివేదికలు న్యాయసేవ సంస్థకు అందజేశారు.
విడిసిలు అక్రమ పద్ధతులలో అక్రమాల పుట్టలు పెట్టి ప్రభుత్వానికి చెందాల్సిన పైసలను పంచుకుంటున్న విధానం వెలుగులోకి వచ్చింది. వాటిని పరిశీలించిన సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి. ఎన్ భారత లక్ష్మీతో విడిసిలపై అధికారులు అందజేసిన నివేదికలపై చర్చించి తదుపరి చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమించారు.
దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పేరెన్నికగన్న అంకపూర్ గ్రామంలోనే 37 కమర్షియల్ కాంప్లెక్స్, విడిసి భవనం, కమ్యూని టి భవనం,కల్యాణ మండపం గ్రామ పంచాయితీ అనుమతులు లేకుండా నిర్మాణం జరిగిందని అద్దెలన్ని విడిసికి వెళుతున్నాయని తెలిపారు. కమర్షియల్ కాంప్లెక్స్ అన్నియు నిజాం సాగర్ కెనాల్ నీటి పారుదల శాఖ భూములేనని ఆర్మూర్ తహసీల్దార్, ఆర్మూర్ మండల అభివృద్ధి అధికారి తమ అధికారిక నివేదికలో పొందుపరిచారు.
ఫతేపూర్10,పిప్రి 23,సుర్బిర్యాల్ 11 విడిసి ఖాతాలో.ఆలూరు మండల కేంద్రంలో 30 మడిగలు,కల్లేడి గ్రామంలో ఏకంగా విడిసి ఒక భవనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కు కిరాయికి ఇచ్చి కిరాయి దబ్బులన్ని విడిసి కైకర్యం చేస్తోంది. ఇదే మండలంలోని గుత్ప 10 మడిగలు తన ఆధీనంలో నే ఉన్నాయి.జక్రాన్ పల్లి మండల కేంద్రంలో 8,మునిపల్లి 4,తొర్లికొండ 34,లక్ష్మపూర్ 3,కేశ్ పల్లి 6,కలిగోట్ 4 ,చింతలూర్ విడిసి వశం.
మోర్తాడ్ మండల కేంద్రంలో 6, డొంకల్ 6, దొన్పల్ 6, భీంగల్ మండలంలోని ఓకే ఒక్క గ్రామం ముచ్కూర్ గ్రామంలో 27 విడిసి చట్రంలో ఉన్నాయి. ఇవి అన్ని ప్రభుత్వ భూములలో నిర్మితమైన వి,కిరాయిలు లక్షల రూపాయలు మాత్రం గ్రామ అభివృద్ధి కమిటీల ఖాతాలలో జమ అవుతున్నాయి.
ఏదైనా చట్ట ప్రకారమే నడవాలి కాని చట్టవిరుద్దంగా ఉండరాదనేది పిర్యాదుదారుల ఆలోచన అని, చట్ట పరమైన పాలన ఉండాలనేది న్యాయసేవ సంస్థ లక్ష్యమని,న్యాయాన్ని కోరడం పౌరుల ప్రాథమిక హక్కు అని జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు.ప్రభుత్వానికి చెల్లించే పన్నులు అంతిమంగా ప్రజల మౌళిక సదుపాయాలకే వినియోగం అవుతాయని అన్నారు.
చట్ట ప్రకారమే ఉండాలి కాని చట్టవ్యతిరేకమైన తీరు సరికాదు.
గ్రామ అభివృద్ధి కమిటీల ఆధిపత్య ధోరణి అవధులు దాటిపోవడంతోనే ,దానికి బాధితులైన వారు కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. మనం ఉన్న ఇంటికి ఇంటిపన్ను కడుతునామ్ ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలకు కిరాయిలు వసూలు విడిసిల ఎందుకు వెళ్ళాలి. రాజ్యాగం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వ శాఖలకే వెళ్ళాలి అనేది న్యాయ వ్యవస్థ ఉద్దేశ్యం. పల్లెల ప్రగతికి నిధులు వెలితే ప్రగతిదారులు వెలసి వికసిత భారత్ వైపు మన అడుగులు పడాలి.
భారత్ బలంగా తయారు కావాలంటే చట్ట అనుకూలమైన ,చట్టాన్ని గౌరవించే వ్యవస్థల నిర్మాణం ఉండాలే కాని చట్టవ్యతిరేకమైన వ్యవస్థ ల వ్యక్తుల సమూహాలు సమాజానికి హానికరమని న్యాయవ్యవస్థ చట్టాల ద్వారా నిర్మించుకున్నదని దానిని అందరు గౌరవించాలని ,చట్ట నడవికనే పౌరుల ప్రాథమిక బాధ్యత కావాలని జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఆకాక్షించారు.