calender_icon.png 6 September, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో మామ అల్లుడు మృతి

05-09-2025 11:31:47 PM

రేగొండ,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిట్యాల మండలం బావుసింగ్ పల్లి గ్రామానికి చెందిన కోడపాక నరసయ్య (50),కోవల సంజీవ్ (35) ఇద్దరు వరుసకు మామ అల్లుళ్ళు శుక్రవారం సాయంత్రం భూపాలపల్లి కేంద్రం నుండి బాంబుల గడ్డ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అతివేగంతో ఎదురుగా దూసుకు వచ్చిన టాటా ఏసీ వాహనం ఒక్కసారిగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా ఘటన స్థలిని స్థానిక పోలీసులు పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మామ అల్లుళ్లు ఒకేసారి మరణించడంతో చిట్యాల మండలం బావూసింగ్ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.