11-10-2025 01:57:24 AM
నకిరేకల్ అక్టోబర్ 10 (విజయక్రాంతి) ప్రభుత్వం సూచించిన నాణ్యత ప్రమాణాల తో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిరైతులనుకోరారు .శుక్రవారం నకిరేకల్ మండలం తాటికల్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఆమె తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలని, తేమ తాలు ,తరుగు,చెత్త,చెదారం వంటివి లేకుండా పూర్తి నాణ్యతతో తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సహకరించాలని ఆమెకోరారు. రాష్ర్ట ప్రభుత్వం వరికి క్వింటాల్ కు 2389 /- రూపాయల మద్దతు ధర ప్రకటించిందని, ఈ ధరను పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు ఆమెఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని పరిశీలించి తూర్పార బట్టించి, తేమ ,తాలు లేకుండా చూసుకోవాలని, నాణ్యతతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. ఆమె వెంటజిల్లా సహకార అధికారి పత్యానాయక్, ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి, జిల్లా పారసరఫరాల అధికారి వెంకటేశం, నకిరేకల్ తాహశీల్దార్ యాదగిరి ,ఏడిఏ జానీ మియా ,పిఎసిఎస్ సీఈవో జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.