11-10-2025 01:55:30 AM
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత , జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొం దించిన సమాచార హక్కు చట్టం, 2005 పైన జిల్లా అధికారులందరు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అక్టోబర్ 5 నుండి 12 వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి లో నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో భాగంగా జిల్లా స్థాయి లో అన్ని శాఖల అధికారులకు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,జిల్లా కలెక్టర్ హనుమంత రావు అధ్యక్షతన ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా పౌరులకు సాధికారత కలిగిందని,అధికారులు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకునే హక్కు పౌరులకు లభించిందన్నారు.ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకతను తీసుకురా వడం, ప్రభుత్వ అధికారులు తమ చర్యలకు జవాబుదారీగా ఉండేలా చేసిన ఈ చట్టం పట్ల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే దరఖాస్తు దారుడు కోరిన సమాచారాన్ని సరైన విధంగా, నిర్ణీత గడువులో ఇవ్వగలుగుతారన్నారు.
ఆర్‌టిఐకి సంబందించిన దరఖాస్తులను పరిష్కరించడం లోఇప్పటివరకు అన్ని శాఖల అధికారులు బాగా పని చేయడం జరిగింది.ఇప్పటి వరకు చాలా అప్లికేషన్ డీస్పోజ్ చేయడం జరిగింది. మున్ముందు కూడా ఇలాగే ఎప్పటికప్పుడు ఆర్ టిఐ అప్లికేషన్ లను త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు ఈ చట్టం లో పొందుపరిచిన ప్రతి అంశం పైన అవగాహన ఉంటే ప్రతీ దరఖాస్తు కి సమాధానాన్ని ఇవ్వడం సులభమన్నారు.
ఎప్పటికప్పుడు అధికారులు వారి క్రింది స్థాయి సిబ్బంది కి చట్టం మీద అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశం లో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, రెవెన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృతిక, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్ ,అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.