27-12-2025 02:17:10 AM
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్‌రెడ్డి గుండె ఆగుతుందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘దమ్ముంటే మీ నాయనను తీసుకుని అసెంబ్లీకి రా! లేదా ప్రతిపక్ష నేత హోదా నువ్వు తీసుకో. అప్పు డు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వు’ అని ఎంపీ చామల.. కేటీఆర్‌కు సవా ల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని శుక్రవారం ఆయ న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ‘కేటీఆర్ హైదరాబాద్‌లో తొడలు కొడుతున్న డు.
నేను బూతులు మాట్లాడుతాని అంటున్నా డు. కట్టె.. కొట్టె తెచ్చే అనేది మీ కుటుంబానికి వర్తిస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మీరు వచ్చించలేదా? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి.. కేవ లం మీ సొంత సంపదనే పెంచుకున్నారు. కేటీఆర్ వల్లే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండుసున్నా వచ్చిం ది’ అని ఎంపీ చామల మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయితే.. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఇండి పెండెంట్‌గా జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యారని ఆయన గుర్తు చేశారు.
రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 2029లోనూ రేవంత్‌రెడ్డి చేతిలో బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదన్నారు. కేటీఆర్ ఐరెన్‌లెగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఏదో పొడిచానని చెప్పుకుంటున్న కేటీఆర్‌ను కంటో న్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్ని కల్లో ప్రజలు ఓడగొట్టారని తెలిపారు. ఎప్పుడూ అధికారం తమకే ఉంటుందని బీఆర్‌ఎస్ హ యాంలో నియంత పాలన చేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు.
హైడ్రా కూల్చివేతలు ప్రజల ప్రయోజనాల కోసమేనని, అక్రమ కబ్జాలను అడ్డుకుంటుంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో కాలనీలు, పార్కులను కబ్జా చేసి దోచుకున్నారు. ‘మీ హయాంలో పేదలకు సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇళ్లను ప్రజలకు ఇవ్వలేదు’ అని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమంటే డబ్బులు ఇవ్వడం కాదని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ధనవంతులను చేయడమని అర్థమని చెప్పారు.