calender_icon.png 10 August, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాకీలో భారత్‌కు కాంస్యం

27-10-2024 12:00:00 AM

సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్

న్యూఢిల్లీ: మలేషియా వేదికగా జరిగిన సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ జూనియర్ మెన్స్ హాకీ టోర్నీలో భారత జట్టు కాంస్యం గెలుచుకుంది. శనివారం జరిగిన పతక పోరులో భారత్ 3-2తో న్యూజిలాండ్‌పై షూటౌట్‌లో విజయం సాధించి కాంస్యం ఒడిసిపట్టింది. గుర్జోత్ సింగ్, మన్మీత్ సింగ్, సౌరబ్ ఆనంద్‌లు బంతిని విజయవంతంగా గోల్‌పోస్ట్‌లోకి తరలించారు.

అంతకముందు భారత్, కివీస్ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగియడంతో ఫలితం తేల్చేందుకు షూటౌట్ అనివార్యమైంది. భారత్ తరఫున దిల్‌రాజ్ సింగ్ (ఆట 11వ నిమిషంలో), మన్మాత్ సింగ్ (20వ ని.లో) గోల్స్ చేయగా.. కివీస్ తరఫున ఒవెన్ బ్రౌన్ (51వ ని.లో), జాంటీ ఎల్మెస్ (57వ ని.లో) గోల్స్ సాధించారు.