14-11-2025 12:24:06 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, నవంబర్ 13 :శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా పెద్ద కంజర్ల వరకు గల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు అతి త్వరలో హెచ్‌ఎండిఏ ద్వారా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్ చెరు పరిధిలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు నుండి ఇంద్రేశం మీదుగా పెందకంజర్ల వరకు 60 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణానికి ఇంద్రేశంతో పాటు రామేశ్వరంబండ, పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ఐనోలు, బచ్చుగూడెం, పోచారంతో పాటు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ రహదారినే వినియోగిస్తారని తెలిపారు. గతంలో ఇంద్రేశం నుండి పెద్దకంజర్ల వరకు రూ.22 కోట్లతో రహదారి విస్తరణ పనుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.
అనివార్య కారణాల వల్ల నిధుల కేటాయింపు రద్దు కావడంతో తిరిగి రహదారి వరమ్మత్తులు చేపట్టారని. ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. అతి త్వరలో రహదారి విస్తరణ పనులు సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో బీటీ ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్ బి ఏఈ చంద్రశేఖర్, ట్రాఫిక్ సిఐ లాలు నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు అంతిరెడ్డి, బండి శంకర్, దుర్గారెడ్డి, రామచందర్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.