calender_icon.png 14 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

32 కార్లతో ఉగ్రకుట్ర

14-11-2025 12:21:41 AM

-అల్-ఫలాహ్ వర్సిటీపై చర్యలకు సిద్ధమైన ఎన్‌ఎంసీ 

-ఆగస్టులోనే దుబాయ్‌కి డాక్టర్ ముజఫర్ పరారీ

న్యూఢిల్లీ, నవంబర్ 13: మొత్తం 32 కార్ల తో నిందితులు భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ వేశారంటేనే ఢిల్లీ పేలుడు కేసు వెనుక ఎంత పెద్ద నెట్‌వర్క్ ఉందో బహిర్గతం అవుతోంది. ఆల్ఫ లాహ్ మెడికల్ కాలేజీ కేంద్రంగా స్కెచ్ వేసి నట్టు జైషే మాడ్యూల్‌కు లింకుల డొంకా కదులు తోంది. పేలుడు పదార్థాల రవాణా కు, దాడులకు 32 కార్లను ఏర్పాటు చేసికున్నారని దర్యాప్తు బృందాలు పేర్కొ న్నాయి.

వీటిలో ఐ20, బ్రెజ్జా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లు ఉన్నాయని పేర్కొ న్నాయి. ఈ 32 కార్లన్నీ డిసెంబర్ 6న ఒకేసారి పేలుళ్లకు వాడాలని ప్లాన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ రోజు బాబ్రీ మసీద్ కూల్చివేత రోజు. ఇప్పటికే నాలుగు వాహ నాలను గుర్తించారు. బ్రెజా ఫరీదాబా ద్‌లోని ఆల్ఫలాహ్ మెడికల్ కాలేజీ ప్రాంగ ణంలో దొరికింది. అదేప్రాంతంలో ఎకో స్పోర్ట్ కారును స్వాధీ నం చేసుకున్నారు.

ఈ కారు వెనుక సీట్లో నిద్రిస్తున్న యువకుడిని పోలీ సులు అరెస్ట్ చేశారు. డిజైర్‌కారు నుంచి తుపాకులు, బెల్లెట్లు దొరికాయి. ఢిల్లీ ఘటన లో ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ సహచ రులైన ఆదిల్ అహ్మద్ రాథర్, ముజమ్మిల్ షకీల్, షాహినా సయీద్‌ను నడిపించిన బ్రెజ్జాకారు ఫరీదా బాద్‌లో స్వాధీనం చేసుకు న్నారు. అక్కడి ఆల్ఫలాహ్ ఆస్పత్రి, జమ్మూ కశ్మీర్ ఆనంత్ నాగ్ మెడికల్ కాలేజీలో 3వేలకిలోల పేలుడు పదార్థాలు, తుపాకుల ను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఈ కుట్ర వెనుక జైషే  ఉగ్రసంస్థ ఉందని తేలింది. 

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వలస

డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ స్వస్థలం ఖమ్మ జిల్లా. 20 ఏళ్ల క్రితమే ఈ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. మెహిదీపట్నం, టోలిచౌకి, రాజేంద్రనగర్ తర్వాత ఉప్పరపల్లిలోని పోర్ట్‌వ్యూకాలనీలో నివాసం ఉంటున్నట్లు తేలింది. నిందితుడు డాక్టర్ సయ్యద్‌అహ్మద్ 2007 నుంచి 2023 వరకు చైనాలో చదివొచ్చాక డాక్టరుగా చేశా రని తెలుస్తుంది. ఇతడు 2021లో పెళ్లి  చేసు కున్నా, భార్యకు విడాకులు ఇచ్చాడని తేలింది.

300 మీటర్ల దూరంలో తెగిన చెయ్యి

ఢిల్లీ పేలుడు ఘటనలో తాజాగా లజపతి రాయ్ మార్కెట్‌లోని ఓ దుకాణంపై తెగిన చెయ్యిని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఈ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంఉంది. ఈ షాపు పైకప్పుపై మోచేతి కింది భాగం వరకు ఉన్న చేయిని ఫోరెన్సిక్ గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. దీనికి డీఎన్‌ఏ పరీక్షలు చేయనున్నారు. 

వర్సిటీకి న్యాక్ నోటీసు.. ఈడీ ఫోకస్

ఎర్రకోట పేలుడు కేసులో, ఉగ్రకుట్రలకు కేంద్రమైన అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంపై రోజురోజుకూ ఉచ్చు బిగుస్తోంది. వర్సిటీ తప్పుడు అక్రిడిటేషన్‌ను నమోదుచేసినందు కు నాక్(ఎన్‌ఏఏసీ) గురువారం షో-కాజ్ నోటీసు జారీచేసింది. దీంతో వెబ్‌సైట్‌ను వర్సిటీ నిర్వాహకులు తొలగించారు. దర్యాప్తు తర్వాత విశ్వవిద్యాలయంపై తగిన చర్యలు తీసుకుంటామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తెలిపింది. ఈడీ కూడా చర్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఈడీడైరెక్టర్ నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసు కుంది.. ఆర్థిక అవకతవకలను గుర్తింపున కు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించనుంది. 

ముజఫర్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ!

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ఛేదించిన ఇంటర్-స్టేట్ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధించి దక్షిణ కశ్మీర్‌లోని ఖాజీగుండ్‌కు చెందిన డాక్టర్ ముజఫర్‌పై రెడ్‌కార్నర్ నోటీ సు జారీ చేయాలని జమ్మూకశ్మీర్ పోలీసులు ఇంటర్ పోల్‌ను సంప్రదించారని గురువారం దర్యాప్తు వర్గాలు తెలిపాయి. కానీ ఆగస్టులో ఆయన భారత్ నుంచి దుబాయ్‌కి వెళ్లినట్లు తేలింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నట్లు దర్యాప్తు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఉగ్రలింకులు నిరాధారం: తుర్కియే

తమ దేశంలో ఢిల్లీ ఉగ్ర లింకులు ఉన్నట్లు ఎటువంటి ఆధారలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని తుర్కియే డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఫర్ కౌంటర్ డిస్ ఇన్ఫర్మేషన్ సంస్థ పేర్కొంది. భారత్ లేదా మరే ఇతరదేశాన్ని లక్ష్యంగా చేసుకుని తుర్కి యే ఉగ్రవాద కార్యకలాపాల్లో తుర్కియే పాల్గొంటుందనే ఆరోపణలను ఖండించింది. 

హైదరాబాద్‌లో ఏటీఎస్ తనిఖీలు

హైద్రాబాద్:హైదరాబాద్‌లోని రాజేం ద్రనగర్‌లో గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్(ఏటీఎస్) పోలీసులు తనిఖీలు చేశా రు. ఎస్పీస్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదు గురు సభ్యుల బృందం ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహి యుద్దీ న్ ఇంట్లో సోదాలుచేసింది. 3 రకాల లిక్వడ్ లు, కంప్యూటర్, పుస్తుకాలు, ఆయిల్ త యారీ మిషన్, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. స య్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులిచ్చి, తనిఖీలు చేశారు.  ఢిల్లీ కుట్ర ఆరోపణలపై హైదరాబాద్‌కు చెందిన సమయ్యద్ అహ్మద్‌ను ఏటీఎస్ పోలీసులు గుజరాత్‌లోని బనస్కాంత్ జిల్లాలో అరెస్టు విషయం తెలిసిందే. 

అల్ ఫలాహ్ వర్సిటీ సభ్యత్వం రద్దు

ఢిల్లీ పేలుళ్ల దర్యాప్తులో ఉగ్రలింకుల్లో సిబ్బంది ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాల యం సభ్యత్వాన్ని అసోసియేషన్ ఆఫ్ ఇం డియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సస్పెం డ్ చేసింది. అన్ని విశ్వవిద్యాలయాలు నిబం ధనలకు అనుగుణంగా ఉన్నంత వరకు మాత్రమే సభ్యులుగా ఉంటాయని ఏఐ యూ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ ఉగ్ర లింకులన్నీ అల్-ఫలాహ్ విశ్వ విద్యాలయం నుంచే జరిగినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చుతుండడంతో ఏఐయూ తక్ష ణమే విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని సస్పెం డ్ చేసింది.

దాని పేరు గానీ, లోగో కానీ ఎక్కడ కూడా వాడొద్దని వర్సిటీని ఆదేశిం చింది.  ఈ మేరకు ఏఐయూ లోగోను దాని అధికారిక వెబ్‌సైట్ నుంచి వెంటనే తొలగిం చాలని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. కార్పొరేట్ వ్యవహారాల మం త్రిత్వ శాఖ, జౌబాకార్ప్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, వర్సిటీ కనీసం 15 కంపెనీలతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.