27-10-2024 12:00:00 AM
మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి
రావల్పిండి: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘణ విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 3.1 ఓవర్లలోనే ఛేదించింది. అంతకముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే కుప్పకూలింది.
నొమన్ అలీ 6 వికెట్లు తీయగా.. సాజిద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు.2021 తర్వాత స్వదేశంలో పాకిస్థాన్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే కాగా.. 2015 తర్వాత ఇంగ్లండ్‌పై పాక్ టెస్టు సిరీస్ నెగ్గడం విశేషం. ఇక తొలి టెస్టులో ఓడి ఆపై సిరీస్‌ను సొంతం చేసుకోవడం పాకిస్థాన్‌కు 1995 తర్వాత ఇదే కావడం గమనార్హం.