calender_icon.png 13 December, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరదలిపై అత్యాచారం చేసిన బావకు... పదేళ్ల కఠిన కారాగార శిక్ష

13-12-2025 12:00:00 AM

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్ డిసెంబర్ 12 (విజయ క్రాంతి): మరదలుపై అత్యాచారం చేసిన ఆమె బావ లాంటేలి సాయినాథ్ కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ మహిళలపై జరిగిన అత్యాచారాల కేసులను విచారించే ప్రత్రేక సెషన్స్ జడ్జి డి. దుర్గా ప్రసాద్  శుక్రవారం తీర్పునిచ్చారు. కోర్టు వెలువరించిన ఇరవై తొమ్మిది పేజీల తీర్పులోని వివరాలు.. నిజామాబాద్ నగర సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పూర్తిస్తాయి నేర విచారణ అనంతరం కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అదారంగా నేర న్యాయ విచారణలో పన్నెండు మంది సాక్షుల వాంగ్మూలాలు, పది ధ్రువీకరించుకున్న పత్రాలు, ఐదు వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసిన పిదప.

పోలీసుల తరపున ప్రాసిక్యూషన్,డిఫెన్స్ న్యాయవాది వాదనలు విన్న జడ్జి దుర్గా ప్రసాద్ ముద్దాయిపై నేర నిర్దారణ చేశారు. లాంటిలే సాయినాధ్ భార్యబిడ్డతో నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వేషన్ దగ్గర నివసించేవాడు.తన స్వంత మరదలుపై కన్నుపడింది. ఎలాగైనా ఆమెను శరీరకంగా అనుభవించాలనే దుర్బుద్ధి కలిగింది. భార్య ఇంటిలో లేని రోజు 2019,నవంబర్ 29 తేదీన పని ప్రదేశంలో పని చేసుకుంటున్న మరదలు దగ్గరకు వెల్లి ఇంటిలో ఎవరు లేరు వంట సమాన్లు కడిగిపెట్టమని ఆమెను బైక్ పై కూర్చుండ బెట్టుకుని తాను నివాసమున్న భూమారెడ్డి కన్వేషన్ దగ్గరలోని ఇంటికి తీసుకువెళ్ళాడు.

వంట సమాన్లు కడిగిన వెంటనే ఆమె ఇంటిలోకి రాగానే ఇంటికి గడియపెట్టి, ఆమెను బలవంతంగా అత్యాచారం చేశాడనే నేరారోపణలు రుజువు అయ్యాయి. భారత శిక్షస్కృతి సెక్షన్ 376 (అత్యాచారం ) నేరంకుగాను పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తమ తీర్పులో పేర్కొన్నారు. పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.