calender_icon.png 21 November, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరవెల్లి భూసేకరణ వేగవంతం చేయాలి

25-07-2024 02:01:01 AM

అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశం

కరీంనగర్, జూలై 24 (విజయక్రాంతి): గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఎస్‌డీసీ భూసేకరణ పనులపై ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో భూసేకరణ పనులు ఎంతవరకు వచ్చాయి? ఎన్ని ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది? ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అధికారులు వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకో వాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ భూసేకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, ఎల్‌ఎండీ ఈఎన్‌సీ శంకర్, ఎస్‌ఈ శివకుమార్, ఎస్‌డీసీ కిరణ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.