calender_icon.png 11 September, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, భారతీయ కిసాన్ సంఘ్ పార్టీ నాయకుల అరెస్టు

05-09-2025 12:20:02 AM

తాడ్వాయి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి ) : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను, భారతీయకి సామ్సంగ్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లలో ఉంచారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నందున  ముందస్తు జాగ్రత్తగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి సదాశివ నగర్  పోలీస్ స్టేషన్ లో, భారతీయ కిసాన్ సంగ్  పార్టీకి చెందిన నాయకులు అరెస్టు చేసి తాడువాయి  పోలీస్ స్టేషన్ లో ఉంచారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాడ్వాయి మండలం ఎర్రపహాడు శివారులో ఎలిప్యాడ్ లో దిగి అక్కడ నుంచి లింగంపేట మండలం, ఎల్లారెడ్డి మండలాలకు వెళ్లారు అక్కడ ఇటీవల జరిగిన వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు అనంతరం అక్కడి నుంచి ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డు మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకున్నారు. కామారెడ్డిలో లో ఇటీవల జరిగిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు.