08-05-2025 12:09:52 AM
-ఏడాదిలోనే కాంగ్రెస్ 3,500 ఇండ్లు కట్టిస్తంది
- మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, మే 7 : పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ని పేదల సొంతింటి కల నెరవేరలేదని రవా ణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం ఆయ న సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రం లో 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చె క్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
పదేండ్లలో బీఆర్‌ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గానికి 1237 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తే, ఇప్పటివరకు 443 కుటుంబాలకు మా త్రమే ఇండ్లు వచ్చాయన్నారు. మరో 227 ఇండ్లు ఇంకా పూర్తి కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు నడుం బిగించిందన్నారు. ‘గత ప్రభుత్వం పేదల గూడు విష యంలో నిర్లక్ష్యం వహించిందనీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేసిందన్నారు.
మొదటి దశ లో ఇండ్లు రానివారు నిరాశ పడుద్దన్నారు. ‘రెండు నెలల్లోనే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పేదల్లో అత్యంత పేదవారిని గుర్తించి, రాజకీయాలకు అతీతంగా, అవినీతికి తావు లేకుండా ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం కూడా అందిస్తామన్నారు. మహి ళా సంఘాలకు రూ.లక్ష వరకు రుణం అం దిస్తామని ప్రకటించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి మంత్రి శుభవార్త చెప్పారు.
‘అధికారులకు వివరాలు అం దించిన వెంటనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను విడుదల చేస్తాం. గత ప్రభు త్వం ప్రారంభించిన పథకాలను మేం కొనసాగిస్తున్నాం, చెక్కుల పంపిణీలో ఎలాంటి ఆలస్యం జరగదని మంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలోనే కొత్తగా 47 వేల మందికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, కోహెడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
బస్సు ఎక్కిన రవాణా శాఖ మంత్రి
కొండపాక, మే 7: రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వస్తుండగా టోల్గేట్ వద్ద కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కి సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రయాణం చేశారు బస్సులో అందరూ మహిళలు ఉండడంతో మహాలక్ష్మి పథకం అమలు తీరు పట్ల వర్షం వ్యక్తం చేశా రు ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బస్సులో ఉచిత ప్రయాణం వల్ల తమకు చా లా డబ్బులు ఆదా అవుతున్నాయి అంటూ మహిళలు చెప్పడంతో మంత్రి ప్రభుత్వ పనితీరును వివరించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని మీ తల్లిదండ్రుల లక్ష్యాలను నెరవేర్చాలని బస్సు లో ప్రయాణిస్తున్న విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సమ్మెను వాయిదా వేసినందుకు ఆర్టీసీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ శాఖకు ప్రతినెల 330 కోట్లు చెల్లిస్తుందని వివరించారు.