08-05-2025 12:09:56 AM
మేడ్చల్,మే 7: ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు మేడ్చల్ లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు శ్రావణ్ గుప్తా ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి.ఆర్యవైశ్య మహిళలు అయ్యప్ప కామన్ నుండి ఊరేగింపుగా గంగ జలాన్ని కలశాల తో పాటు పంచామృతలను అయ్యప్ప ఆలయం వరకు తీసుకు వచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు.
ఆర్యవైశ్య మహిళలు సామూహిక కుంకుమార్చన,అమ్మవారి జీవిత చరిత్ర మరియు అష్టోత్తరం పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు.పూజలో కూర్చున్న భక్తులకు అమ్మవారి విగ్రహాన్ని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అందచేశారు.పూజలో కూర్చున్న భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు.అనంతరం అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు.సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహంచే శోభాయాత్ర అయ్యప్ప ఆలయం నుండి ప్రధాన విధుల గుండా కోలాట కార్యక్రమాలతో అంగరంగా వైభవంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బద్రి నారాయణ, ప్రధాన కార్యదర్శి కృష్ణ మూర్తి,కోశాధికారి గోలి శ్రీధర్ ,మున్సిపాలిటీ అధ్యక్షుడు చంద్రమౌళి ,ప్రధాన కార్యదర్శి సఖిలం వెంకటేష్,కోశాధికారి యాద రాంచందర్,మహిళ అధ్యక్షురాలు సంగీత, ప్రధాన కార్యదర్శి సవిత,కోశాధి కారి సునీత, యూత్ అధ్యక్షుడు వెంకట్ ,ప్రధాన కార్యదర్శి నాగేష్, కోశాధికారి అవినాష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.