08-05-2025 12:08:47 AM
దేవరకొండ,మే 7 : దేవరకొండ మండలంలోని మర్రి చెట్టుతండా వద్ద 15లక్షల రూపాయల వ్యయంతో మైత్రి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వారు మరియు ట్రైకర్ నిధులతో నిర్మించిన గోదాంను బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మైత్రి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నిర్మించిన గోదాం ను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ సూర్యాపేట డిడిఎం రవీందర్ నాయక్,మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పిఎసిఎస్ చైర్మన్లు డాక్టర్ వేణుధర్ రెడ్డి,కొండ్ర శ్రీశైలం యాదవ్, ఎంపిడిఓ డానియల్, స్పెషల్ ఆఫీసర్ శంకర్, మాజీ ఎంపీటీసీ కొర్ర గౌతమి రాంసింగ్ నాయక్, కిన్నెర హరికృష్ణ,మాజీ ఎంపీటీసీ సీత్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు.