calender_icon.png 30 January, 2026 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల కోసం బీఆర్‌ఎస్ పోరుబాట

24-10-2024 01:31:04 AM

  1. నేడు ఆదిలాబాద్‌లో భారీ సభ 
  2. హాజరుకానున్న కేటీఆర్ 

ఆదిలాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుతం అవలంబిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్‌ఎస్ పోరుబాటకు దిగింది. రైతులకు ఇచ్చిన హా మీలతోపాటు ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత వైఫల్యాలను ఎండగడుతూ జిల్లాల వారీగా సభలను నిరహించనున్నారు.

ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లోని రామ్ లీలా మైదానంలోగురువారం చేపట్టే  రైతు పోరుబాట సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లను  పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న బుధవారం పర్యవేక్షించి పార్టీ శ్రేణులకు  సూచన లు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, నాయకులు రౌతు మనోహర్, రోకండ్ల రమేశ్, ఇజ్జగిరి నారాయణ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.