calender_icon.png 9 January, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ

08-01-2026 12:18:23 AM

యువత భవిష్యత్తును కాపాడుకోవాలంటూ పిలుపు

శేరిలింగంపల్లి, జనవరి 7 (విజయక్రాంతి): డ్రగ్స్ మత్తుకు బానిసై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తూ డ్రగ్స్కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని, చదువు, ఉపాధి, క్రీడలపై దృష్టి పెట్టి దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆయన కోరా రు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, యువత అందరూ కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ర్యాలీలో పాల్గొన్న నేతలు పిలుపునిచ్చారు.