calender_icon.png 9 January, 2026 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెదిరింపులకు పాల్పడలానుకున్న నలుగురు అరెస్ట్

08-01-2026 12:17:53 AM

రాజన్న సిరిసిల్ల, జనవరి 7 (విజయక్రాంతి): ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, పయ్యలపు గోవర్ధన్ ,జగిత్యాల జిల్లాకు చెందిన మంజరి సురేందర్, అనే నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు గురి చేయడం,డబ్బు వసూలు చేయడం,భూ వివాదాలలో జోక్యం చేసుకోవడం లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నరన్న నమ్మదగిన సమాచారం మేరకు తంగళ్లపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అపి తనిఖీ చేయగా వీరి వద్ద ఒక్కటి 9 ఎంఎం పిస్తోల్ 05 రౌండ్స్ ఉండగా వాటిని స్వాధీన పర్చుకొని నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలను బెదిరించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, టాస్క్ఫోర్స్ సి.ఐ నటేష్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఎస్.ఐ ఉపేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.