calender_icon.png 12 October, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్ కార్మికులను పట్టించుకోని బీఆర్‌ఎస్

12-10-2025 02:26:10 AM

రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ 

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : గల్ఫ్ కార్మికుల విషయంలో బీఆర్ ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్‌కుమార్ అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభు త్వం అమలు చేస్తున్న గల్ఫ్ సంక్షేమ కార్యక్రమాలపై హరీశ్‌రావు అబద్దాలు ఆడుతున్నా రని ఆయన మండిపడ్డారు. హరీశ్‌రావును , గల్ఫ్ కార్మికుల  చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడిందని  ఘాటుగా విమర్శించారు.

శనివా రం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో  రెండు వేల మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాల్లో చనిపోతే వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదని ఆరోపించారు. పదేళ్లలో ఏనాడు గల్ఫ్ కార్మికులు మీకు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల పాలిట కేసీఆర్ ఒక నరరూప రాక్షసుడని, కేటీఆర్, కవిత, హరీశ్ చిన్న రాక్షసులని అనిల్ ఫైర్ అ య్యారు.

ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్‌రావు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఒక్క రూ పాయి కేటాయించలేదని, ఇప్పుడు ఏ ము ఖం పెట్టుకుని మాట్లాడుతున్నాడని ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్, అంబాసిడర్ వినోద్ కుమార్ ప్రశ్నించారు. బొగ్గుభాయి - బొంబాయి దుబాయ్ అనే నినాదంతో ప్ర త్యేక తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో..

వలస కార్మికులను రెచ్చగొట్టి వాడుకుని, నట్టేట ముంచిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదని కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావు అన్నారు. గల్ఫ్ కార్మికులకు ఎ న్నో హామీలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్, కవితతో పాటు ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీశ్‌రావు మాట త ప్పారని కమిటీ సభ్యులు నంగి దేవేందర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి మాట్లాడుతూ..

హరీశ్‌రావు గల్ఫ్ కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి  గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు, ఫిర్యాదుల స్వీకరణకు ‘ప్రవాసీ ప్రజావాణి’ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో అడ్మిషన్లు, సమగ్ర ఎన్నారై పాలసీ రూపకల్పనకు ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు.