30-09-2025 12:13:09 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్త్తోంది. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎండగట్టే దిశగా కార్యాచరణను అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తుంది. పదేళ్లు తెలంగాణను పాలించి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్‌ఎస్ తిరిగి ప్రజలకు దగ్గరయ్యే విధంగా వ్యూహా లు రచిస్తుంది.
ప్రజలకు చేరవై సమస్యలను నేరుగా తెలుసుకునేలా ప్రాంతాల వారీ గా పార్టీ నేతలు క్షేత్రస్థాయిలోకి వెళ్లే కార్యక్రమా న్ని ము మ్మరం చేసింది. ముఖ్యం గా సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలు, రైతు హక్కులపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వచ్చే నష్టం, ప్రస్తుత ప్రభుత్వ పాలనా తీరును ప్రజల్లో చర్చకు వచ్చేలా అడుగులు వేస్తుంది.
ప్రభుత్వాన్ని ఎండగట్టి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగే ఆక్రమణలు, అలెన్మైంట్ మార్పులు, వ్యవసాయానికి దక్కని న్యా యం, భూసేకరణ సమస్యలు మొదలైన అంశాలను బీఆర్‌ఎస్ నేతలు ఎత్తిచూపుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని విధానం, నూతన పాలన వల్ల రైతులు, పేదలకు కలిగిన నష్టాన్ని వాస్తవ ఘటనలతో ప్రజలకు వివ రించే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయి లో పార్టీ శ్రేణులకు ఉత్సాహం నింపి ప్రజల్లో మళ్లీ బలం పెంచుకోవాలని చూస్తోంది.
బాకీ కార్డు పేరిట ఉద్యమం
ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ప్రజల ముం దు ఉంచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్‌ఎస్ నాయకుల్లో, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్టు కనిపించింది. వరుసగా ఎమ్మెల్యేల ఫిరాయింపులతో బీఆర్‌ఎస్‌లో ఆందోళన తలెత్తింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి కుదురుకునే సమయం ఇస్తామని అప్పుడే ప్రకటించిన బీఆర్‌ఎస్ అగ్రనేతలు, ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా తమ ప్రణాళికల అమలులో వేగం పెంచారు.
ప్రభుత్వం ఏర్పాటై 22నెలలు గడుస్తున్నా రాష్ట్రానికి ఒరిగేందేమీ లేదని ప్ర చారం మొదలుపెట్టారు. పలు అంశాల్లో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను వాడుకోనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఇంటింటికీ తిరిగి ప్రచారం ప్రారంభించారు.
ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలు, అవినీతిపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆ దిశగా దర్యాప్తులు, విచారణలు కూడా చేయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీశ్‌రావు, విద్యుత్ కొనుగోలులో కేసీఆర్, ఈ రేసింగ్, టోల్ కుంభకోణంలో కేటీఆర్‌లను ప్రధాన సూత్రధారులని ఆరోపించింది. కాళేశ్వరం కేసు దర్యాప్తును సీబీఐకి కూడా అప్పగించింది.
ఈ రేసింగ్ కేసును ఏసీబీకి అప్పగించింది. అటు సీబీఐ, ఇటు ఏసీబీ ఈ కేసుల విచారణలను కూడా ప్రారంభించాయి. అయినప్పటికీ వాటిని లెక్క చేయ కుండా బీఆర్‌ఎస్ అగ్ర నేతలు ప్రజల సమస్యలను ఎత్తి చూపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బీఆర్‌ఎస్ అధినేత పలు ఆరోగ్య కారణాలతో ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తమదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఇందులో భాగంగా ఇటీవల గద్వాల నియోజకవర్గంలో, ఆదివారం అచ్చంపేట నియోజ కవర్గంలో కేటీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలుగా భావిస్తు న్న అంశాలను ప్రజలకు వివరించే ప్రయ త్నం చేస్తున్నారు. మరోవైపు హరీశ్‌రావు అన్ని వర్గాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. వరదల వల్ల జరిగిన నష్టం, యూరియా కొరత, పలు పథకాలు, ప్రాజెక్టులు, పరిపాలనలో ప్రభుత్వ వెనుకబాటును ప్రధానంగా వినియోగించుకోవా లని ప్రయత్నిస్తున్నారు.