calender_icon.png 30 September, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలా లేకుండానే ఇండ్ల నిర్మాణాలు

30-09-2025 12:12:06 AM

పట్టించుకోని అధికారులు

గద్వాల, సెప్టెంబర్ 29 ( విజయక్రాంతి ) : అడ్డగోలుగా పుట్టుకొస్తున్న అక్రమ వెంచర్లతో అటు ప్రభుత్వానికి, ఇటు కొనుగోలు దారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అనుమతులు ఉంటేనే స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నిర్మాణానికి వీలవుతుంది. ముందుగానే ప్లాట్లు అమ్మేస్తూ ఆ తరువాత అనుమతుల కోసం కష్ట పడాల్సి వస్తోంది.

గద్వాల నియోజకవర్గంలో అనేక చోట్ల అనుమతులు లేకుండానే వెంచర్లు పుట్టుకొస్తు న్నాయన్న విమర్శలు చాలానే ఉన్నాయి. నా లా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ యాక్ట్)గా మార్చకుండానే క్రయ విక్రయాలు సాగుతున్నాయి. సాగు భూములనే అమ్ము తూ నివాస స్థలాలుగా మార్చుతున్నారు.

నో పర్మిషన్ ..

వ్యవసాయ భూమిని వెంచర్గా మార్చాలంటే మొదటగా నాలా కన్వర్షన్ చేయించి డీటీసీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులకు ప్రభుత్వానికి చలానా కట్టా ల్సి వస్తుంది. ఇందుకోసం మార్కెట్ వాల్యూ లో 6 శాతం స్టాంప్, డ్యూటీ రూపంలో క ట్టాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీకి 10 శాతం భూమిని కేటాయించి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, పార్క్ను ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించాలి.

కానీ ఇవేమీ లేకుండానే కేటిదొడ్డి మండల కేంద్రంలో అడ్డగో లుగా అగ్రిమెంట్ లతో ఇండ్ల నిర్మాణాల కో సం ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారన్న విమర్శ లు ఉన్నాయి. కేటిదొడ్డి మండల కేంద్రం లో సర్వేనెంబర్ 9అ, 10 అ లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్లాట్ల చేసి విక్రయాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చ ర్చించుకుంటున్నారు. ఇప్పటికీ నాలా కన్వర్ష న్ తీసు కోలేదని సమాచారం బహిరంగ గా నే వినిపిస్తున్నాయి.

ఆయా సర్వే నెంబర్లలో ఉన్న భూమి భూభారతీ పోర్టల్ ఇప్పటికే వ్యవసాయ భూములుగానేదర్శనమిస్తున్నాయని కానీ వెంచర్ నిర్వాహకులు తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతుండడం గమనార్హం అని స్థానికులు పెదవి విరుచుకుంటున్నారు. అయితే భూభారతీ పోర్టల్ లో వ్యవసాయ భూములని చూపిస్తుండడం, నాలా కన్వర్షన్ కాకపోవడం అనుమా నాలకు తావిస్తోంది.

అయితే వెంచర్ నిర్వహకులు నాలా కన్వర్షన్ చేసుకొని, వెంచర్ కు అనుమతులు తీసుకుని ఉంటే ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూములని దర్శనమివ్వడం పై ప్లాట్ల కొనుగోలు దారుల్లో అయోమయం నెలకొంది. కాగా ఇప్పటికే ఈ వెంచర్ లో ప్లాట్లను కొనుగోలు చేసిన అనుమానాలను ఇటు వెంచర్ నిర్వహకులు లేదా రెవెన్యూ అధికారులు నివృత్తి చేయాల్సిన అసవరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

చర్యలు శూన్యం 

గద్వాల్, ధరూర్ కేటిదొడ్డి మండలాలో రహదారుల వెంట నెలకొల్పిన వెంచర్లకు ఎ లాంటి అనుమతులు లేకపోయినా అటు పంచాయితీ అధికారులు, ఇటు రెవెన్యూ అ ధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

వెంచర్లలో ప్లాట్లు కొనుగోలుచేసిన వారికి పట్టా భూములుగానే రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్ర భుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. అ మాయకులు సైతం కొనుగోలు చేసి తీవ్రం గా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.

విక్రయాలకు పాల్పడినట్లు మా దృష్టికి రాలేదు .....

సర్వేనంబర్ 9 అ, 10 అ లలో ప్లాట్లు చేసి విక్రయాలకు పాల్పడినట్లు మా దృ ష్టికి రాలేదన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుం టాం. వెంచర్ కు ఎలాంటి అనుమతులులేవు.

రాఘవేంద్ర, కేటిదొడ్డి పంచాయతీ సెక్రటరీ