calender_icon.png 30 September, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల అనర్ధాలపై బైక్ యాత్ర

30-09-2025 12:13:44 AM

చారకొండ సెప్టెంబర్ 29: గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం రాష్ట్ర వ్యాప్తం గా జనచైతన్య బైక్ యాత్రను చేపట్టినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ తెలిపారు. జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సుమారు 1,500 కిలోమీటర్లు వివిధ జిల్లాలలో తిరిగి యువతను ప్రజలను జన చైతన్యం చేసి మత్తు పదార్థాలు మాదక ద్ర వ్యాలు తీసుకోవడంలో జరిగే అనర్థాలను వివరించడం జరిగిందన్నారు. యువత ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రణాళిక బద్ధం గా కష్టపడి లక్ష్యాన్ని సాధించాలని తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి మంచి పేరు తీసుకో రావాలని కోరారు. నో డ్రగ్స్ సేవ్ లైఫ్ యువతకుపిలుపునిచ్చారు.