18-12-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్17(విజయాక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. రెండవ విడతలో 30 సర్పంచ్ స్థానాలకు గానూ 20 స్థానాలను గెలుచుకుంది. సిరిసిల్ల నియోజకబర్గము లోని ముస్తాబాద్, గంబిరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలలో ఎన్నికలు జరిగాయి. 3వ విడుత మొత్తం సర్పంచ్ స్థానాలు 87 కాగా ఇందులో ఏకగ్రీవం 7 అయ్యాయి. వీటిలో బిఆర్‌ఎస్ 3, కాంగ్రెస్ 3, స్వతంత్ర 1 గెలిచారు. మిగిలిన స్థానాల్లో బిఆర్‌ఎస్ 50, కాంగ్రెస్.18, బిజెపి6, స్వతంత్ర.లు 4 చోట్ల విజయం సాధించారు.