calender_icon.png 18 December, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్, తహసీల్దార్ కార్యాలయాల తరలింపునకు సన్నాహాలు

18-12-2025 12:02:49 AM

జిల్లా, మండల పరిషత్  కార్యాలయాలను పరిశీలించిన కలెక్టర్ 

మేడ్చల్, డిసెంబర్ 17(విజయ క్రాంతి): మేడ్చల్ మండల, జిల్లా పరిషత్ సిఈఓ కార్యాలయాన్ని జిల్లా రిజిష్ట్రార్, సబ్  రిజిష్ట్రార్, మండల తహాసీల్దార్ కార్యాలయాలకు  కేటాయించడానికి  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు.

బుధవారం మేడ్చల్ మండలంలోని జిల్లా పరిషత్ సిఈఒ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్  రాధికగుప్తాతో కలిసి పరిశీలిం చారు.  ప్రస్తుతం ఉన్న జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో,  సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాన్ని  గ్రౌండ్ ఫ్లోర్ లో, ప్రక్కనే ఉన్న ఎంపిడిఓ కార్యాలయాన్ని మండల తహాసీల్దారు కార్యాలయానికి  కేటాయించడానికి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ కార్యాలయంలోని రెండవ అంతస్తు భవనంలో  పై కప్పు స్లాబ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని అంచనాలను వేసి నివేదిక పంపాలని  పంచాయతీరాజ్ ఏఈని ఆదేశించారు. అదే విధంగా ప్రక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో జి ప్లస్ వన్ కార్యాలయ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందనే నివేదికలు పంపాలని సూచించారు. జిల్లా పరి షత్ కార్యాలయంలోని  గదులను, మీటింగ్ హాల్ లను, ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని  జిల్లా పరిషత్ సిఈఓ కాంతమ్మ కలెక్టరుకు చూపించి వివరాలు తెలియజేసారు. అనంతరం శామీర్ పేట్ లోని ఎంపిడిఓ కార్యాల యాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు .