09-07-2025 10:44:17 PM
కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం చైర్మన్ మల్లెపల్లి రాజావర్ధన్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): దోపిడి చేయడమే ధ్యేయంగా పెట్టుకొని గడిచిన పదేండ్లు పరిపాలన చేశావని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Venkateswar Reddy)ని కురుమూర్తి రాయ ఎత్తిపోతల చైర్మన్ రాజవర్ధన్ రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలోని కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 సంవత్సరాలు అధికార మదంతో మధమెక్కిన నువ్వు కల్లుతాగిన కోతి లాగా ప్రవర్తించేది నువ్వనీ దుయ్యబట్టారు. మా నాయకులు న్యాయవాది కాబట్టి న్యాయన్యాల గురించే తెలుసని, ఇంజనీయర్ నని చెప్పుకునే నువ్వు చెక్ డ్యామ్ ల పేరుతో ఎంత ఇసుక దోపిడీ చేశావో నియోజకవర్గ ప్రజలందరికి తెలిసే నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి నిద్ర లేని రాత్రులు చేసిన సంగతి మరువకూడదన్నారు.
మా గ్రామం పక్కన నిర్మించిన దుప్పల్లి చెక్ డ్యామ్ మీకు ఈత పడటానికి తప్ప 10 మంది రైతులకు కూడా ఉపయోగం లేకపోవడం నీకు రైతుల మీద ఎంత ప్రేముందో అర్థమవుతుందన్నారు. కమీషన్లు రావని మీ అధికారంలో కురుమూర్తి రాయ లిఫ్ట్ ను మూసేస్తే మా నాయకులు జిఎంఆర్ గెలిసిన వెంటనే మరమ్మత్తులు చేయించి 4500 ఎకరాలకు నీరందించి అత్యధికంగా దిగుబడి తెచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం నింపిన ఘనత మా నాయకునికే దక్కుతుందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న మా నాయకుని జోలికొస్తే కబడ్డార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు, మండలంలోని ముఖ్య నాయకులు,వివిధ గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.