20-10-2025 12:00:00 AM
కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
పెద్దపల్లి, అంతర్గాం, అక్టోబర్ 19(విజయ క్రాంతి): రామగుండం నియోజ కవర్గంలోని అంతర్గాం మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భాను తిరుపతి నాయక్, మండల అధ్యక్షులు హ నుమాన్ రెడ్డి ఆధ్వర్యంలో రామగుం డం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాగూర్ తన చేతుల మీదుగా అంతర్గం మండలానికి చెందిన పలు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అంతర్గం మండలం తిరుపతి నాయక్ తన నేతృత్వంలో 30 మంది కార్యకర్తలను రామగుండం ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై, కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారికి కండువా కప్పి స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే రామగుండం నియోజకవర్గం, అంతర్గం మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, పార్టీ బలోపేతం కోసం మీ అందరూ కృషి చేయాలని తెలిపారు.పార్టీలో చేరిన అంతర్గం గ్రామ ఉప సర్పంచ్ ధారవేణి సంతోష్, తమ్మనవేని మణికుమార్, అజయ్, ప్రవీణ్ ను మాట్లాడుతూ ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీ లో చేరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, భునోత్ తిరుపతి నాయక్,కంపెళ్ళి సంతోష్, ఎన్ ఎస్ యు ఐ మండల ప్రెసిడెంట్ ప్రశాంత్, అంతర్గం ప్రాంత ప్రముఖ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.