calender_icon.png 20 October, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి అర్బన్ బ్యాంక్ నామినేషన్లు

20-10-2025 12:00:00 AM

ఎన్నికల బరిలో బీజేపీ ప్యానల్?

పోటీకి దింపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఒత్తిడి తెస్తున్న బీజేపీ శ్రేణులు

కరీంనగర్, అక్టోబర్19(విజయక్రాంతి): ఎపుడెపుదా అని ఎదిరి చూస్తున్న కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల షె డ్యూల్ వెలువడింది. సోమావరం నుండి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 1న ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ తరపున ప్యానెల్ ను నిలబెట్టేందుకు ఆ పార్టీలు సిద్ధం కావడంతో భా రతీయ జనతా పార్టీ సైతం ప్యానల్ ను బరిలోకి దింపాలని ఆ పార్టీ శ్రేణుల నుండి ఒత్తి ళ్లు వస్తున్నాయి.

ఈ మేరకు కేంద్ర హోంశా ఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై ఆయ శ్రేణులు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లా ముఖ్య నేతలు ఆదివారం పార్టీ మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ నివాసంలో స మావేశమై అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో ప్యానె ల్ ను బరిలో దింపే అంశంపై సుధీర్ఘంగా చర్చించారు.

గంగాడి క్రిష్ణారెడ్డి, బాస సత్యనారాయణతోపాటు మాజీ మేయర్లు సునీ ల్ రావు, డి.శంకర్, వాసాల రమేశ్, కోమాల ఆంజనేయులు, ఓదెలు, బోయినిపల్లి ప్రవీణ్ రావు. కన్నె క్రిష్ణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో బీజేపీ పక్షాన ఇండిపెండెంట్ ప్యానెల్ ను బరిలో దించేతేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని మెజా రిటీ నేతలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో బండి సంజయ్ పట్ల అర్బన్ బ్యాంక్ ఓటర్లకు సానుకూలత ఉందని, ఎన్నికల్లో ప్యానెల్ గెలుపుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

వాస్తవానికి కేం ద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి ప్రజాప్రతినిధిగా చేపట్టిన పదవి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మాత్రమే. అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంకు సహా పలు బ్యాంకులను నష్టాల సా కుతో మూసివేసేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్య లు చేపట్టింది. ఆ సమయంలో బ్యాంకు ఛైర్మ న్ గా ఉన్న డి.శంకర్ తో కలిసి డైరెక్టర్ బండి సంజయ్ అర్బన్ బ్యాంకును కాపాడటంలో కీలక పాత్ర పోషించారు.

రుణాల రికవరీలో ముందంజలో నిలిపారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా బ్యాంకు సేవలు కొ నసాగించడంలో కీలక పాత్ర పోషించారు. అర్హులైన వారందరికీ రుణాలు వచ్చేలా చేశా రు. సంజయ్ డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే అత్యధికంగా అర్బన్ బ్యాంకు సభ్యత్వం ఇప్పించారు.

ప్రస్తుతం కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 9,600 మంది ఓటర్లున్నారు. 12 మంది డైరెక్టర్ లను సభ్యులు ఎన్నుకోవలసి ఉంటుంది. ఒకటి ఎస్ సి/ఎస్ టి కి రెండు మహిళలకు, 9 ఓపెన్ కేటగిరి క్రింద ఉన్నాయి. డైరెక్టర్ట్లు ఎన్నికయిన వారు చైర్మన్ ను ఎన్నుకుంటారు. కరీంనగర్ అర్బన్ బాంక్ క్రింద జగిత్యాల, గంగాధర , మానకొండూర్ పరిధిలోని ఓట ర్లు ఉన్నారు. 

బీజేపీ పక్షాన ప్యానెల్ ను బరి లో దింపాలనే భావనను వారు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై ఇం కా తుది నిర్ణయం తీసుకోలేదు. మాజీ చైర్మ న్ డి. శంకర్ ను బరిలో దించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుండి మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్, ప్రస్తుత ఇంచార్జి విలాస్ రెడ్డి లు పోటీ పదుతున్నారు.మంత్రి పొన్నం ఎవరి పెరు సూచిస్తారోచూడాలి.