05-11-2025 02:05:17 AM
బోయినపల్లి : నవంబర్ 4 ( విజయ క్రాంతి ): మాజీ మంత్రి హరీష్ రావును మండల బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం పరామర్శించి సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి మృతి చెందగా ఆయన కుటుంబాన్ని ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, మాజీ జెడ్పిటిసి కొనుకటి లచ్చిరెడ్డి, ఉమ్మడి జిల్లా టిఆర్‌ఎస్ నాయకులు అనుముల భాస్కర్, మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, టిఆర్‌ఎస్ నాయకులు జూలపల్లి అంజన్ రావు తదితరులు ఉన్నారు.