calender_icon.png 21 November, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న బీఆర్ఎస్ నేతలు

24-07-2024 07:08:38 PM

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గురువారం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టానున్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని శసన సభలోని సభ్యులు ఆరోపించడంతో సభను బీజేపీ నేతలు వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం సందర్శనకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. 

బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేదుకు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరానున్నారు. రేపు సాయంత్రం ఎల్ అండ్ డీ రిజర్వాయర్ సందర్శించి రాత్రికి రామగుండెంలో బస చేయనుంది బీఆర్ఎస్ బృందం. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపుహౌజ్, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ సందర్శించనున్నట్లు సమాచారం.