15-12-2025 02:11:39 AM
కరీంనగర్, డిసెంబరు14 (విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండవ విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన పట్టు నిరూపించుకుంది. మొదటి విడతలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు వన్ సైడ్ ఫలితాలు దక్కగా, రెండవ విడతలో సగం నగం అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. శంకరపట్నం, మానకొండూర్, ఇల్లంతకుంట బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లిలో బీఆర్‌ఎస్ తన సత్తా చాటింది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల నియోజకవర్గటంలోని తంగళ్లపల్లి మండలంలో 30 గ్రామాలు ఉండగా బీఆర్‌ఎస్ 17, కాంగ్రెస్ 7, బీజేపీ 4, స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. వేణుగోపాల్పూర్, గండిలచ్చింపేట, రామన్నపల్లి, రాంచంద్రాపూర్, ళ్లపేట, పాపయ్యపల్లి, పద్మనగర్, ఓగులాపూర్, మల్లాపూర్, లక్ష్మీపూర్, కచ్చెకట్కూర్, జిల్లెల్ల, గోపాల్రావుపల్లి, చిన్నలింగాపూర్, చీర్లవంచ, బస్వాపూర్, బద్దెనపల్లి గ్రామాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారు. అలాగే మానకొండూర్ మండలంలోని గంగిపల్లి, మానకొండూర్ మేజర్ పంచాయతీల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
అలాగే గురుపల్లి, శ్రీనివాసనగర్, శంషాబాద్ పంచాయతీల్లో బీఆర్‌ఎస్ అభ్యర్ధులు గెలుపొందారు. శంకరపట్నం మండలంలో కూడా బీఆర్‌ఎస్ పట్టు నిరూపించుకుంది. ఇక్కడ చింతగట్టు. చింతలపల్లి, గద్దపాక, గొల్లపల్లి, కన్నాపూర్, కొత్తగట్టులలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మొలంగూర్, వంకాయగూడెం, అంబేద్కర్ నగర్, నల్ల వెంకయ్యపల్లిలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలోని నీలోజుపల్లి, కోరం, రామన్నపేట, దేశాయిపల్లి గ్రామాల్లో సర్పంచులుగా బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. రెండవ విడతలో బీజేపీ పపర్వాలేదనిపించుకుంది. గన్నేరువరం మండలంలో ఐదు గ్రామాలు, తంగెళ్లపల్లి, శంకరపట్నం మండలాల్లో నాలుగు గ్రామాలు బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.
రెండవ విడతలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధించినప్పటికి మొదటి విడతతో పోల్చుకుంటే తక్కువని చెప్పవచ్చు. తిమ్మాపూర్ మండలంలో మాత్రం కాంగ్రెస్ సత్తా చాటింది. తిమ్మాపూర్ మేజర్ పంచాయతీలో కాంగ్రెస్ బలపర్చిన లక్ష్మారెడ్డి 370 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.