15-12-2025 02:11:35 AM
చేగుంట, డిసెంబర్ 14: ఎన్నికల్లో సానుభూతి ఓట్లు పొందేందుకు సర్పంచ్ అభ్యర్థి భర్త హైడ్రామా సృష్టించారు. తీరా పోలీసులు చేధించడంతో కుటుంబీకులు, గ్రామ స్థులు ఊపిరిపీల్చుకున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో చిరియాల సబిత సర్పంచ్‌గా పోటీలో ఉన్నారు. ఆమె భర్త చిరియాల జనార్ధన్‌రెడ్డి (మాజీ సర్పంచ్) శనివారం రాత్రి 10 గంటల నుంచి కనిపించడం లేదని కుటుంబీకులు తెలిపారు.
వారి ఫిర్యాదు మే రకు తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, చేగుం ట ఎస్సై చైతన్యకుమార్‌రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. పోలీస్ జాగిలాలతో తని ఖీ నిర్వహించా రు. రాజకీయ కు ట్రలో భాగంగా జనార్ధన్‌రెడ్డిపై అఘాయిత్యం జరిగిందా అని గ్రామస్థులు ఆందోళన వ్య క్తం చేశారు.
ఆదివారం ఎన్నికలు ప్రారంభమైనప్పటికీ జనార్ధన్‌రెడ్డి ఆచూకీ లభిం చకపోవడంతో పోలీసు జాగిలాలతో వెతుకగా ఓ చెట్టు పక్కన దాక్కున్నట్లు కనిపె ట్టారు. అసలు విషయం ఆరా తీయగా ఉద్దేశపూర్వకంగా తాను దాక్కున్నట్లు, రాజకీయ హైడ్రామాలో భాగమని తేలింది. ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.