20-11-2025 12:00:00 AM
భద్రాద్రి నవంబర్ 19 విజయ క్రాంతి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు పిలుపుమేరకు, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మె ల్యే,బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాలతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు మండల వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లమరమ్మత్తులు తక్షణమేచేపట్టాలని డిమాండ్ చేస్తూ, మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ ఆధ్వర్యం లో ఎంపీడీఓ కార్యాలయం ముందు, కాంగ్రెస్ ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదలతో నిరసన తెలియజేసి ఎంపీడీఓ కి విన తిపత్రం అందజేసినారు.
ఈ సందర్బంగా అ ధ్యక్షుడు దొడ్డా రమేష్ మాట్లాడుతూ మండలంలో గుంతలు పడ్డ రహదారులకు వెంట నే మరమ్మతులు చేపట్టాలని,గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంజూరై మొదలుపెట్టిన ప నులు 70% పూర్తయినప్పటికీ కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చి 2సం.లు దా టినా వాటిని పట్టించుకోవడం లేదని వెంటనే ఆ పనులను పూర్తి చెయ్యాలని అన్ని గ్రామ పంచాయతీలలో, అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని,వాటన్నిటినీ పరిష్కరించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్ర మంలో వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరా వు, మండల ఉపాధ్యక్షుడు గాజుబోయిన యేసు బాబు, మాజీ సర్పంచ్ ఉయ్యాల చిన వెంకటేశ్వరావు, యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు, నాయకపోడు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యు లు రావుల శ్రీనివాసరావు, మహేష్,మాజీ ఎంపీటీసీ కాసిని శ్రీను, బీసీ సంఘం నాయకులు తాళ్ల వెంకటేశ్వరావు,మండల నాయ కులు సోడెం గంగరాజు,కుకలకుంట రవి, అ బ్దుల్ జిన్న,కోర్స వెంకటేశ్వరావు,ఎస్ సి సెల్ నాయకులు మద్దెల పుల్లారావు,తోలేం మల్లేశ్వరావు,వల్లెపు నాగేశ్వరావు,కేసిన మధు, వాడపల్లి ఆనంద్రావు,మిడత లక్ష్మీనారాయ ణ,గణేష్,నూతి అజయ్,మడిపల్లి పోలయ్య తదితరులు పాల్గొన్నారు.