20-11-2025 12:00:00 AM
- భద్రాద్రి లో మిషన్ భగీరథ పేరిట రోడ్లన్నీ పెకిలిస్తున్నారు.
- కుప్పలు తెప్పలుగా మట్టి దిబ్బలు..
- గాలికి వదిలేసిన రక్షణ చర్యలు..
- ఆదమరిస్తే చాలు యాక్సిడెంట్ అవడం తథ్యం...
భద్రాద్రి నవంబర్ 19 విజయక్రాంతి; భద్రాద్రి జిల్లాలో గత కొన్ని నెలలుగా, కొత్తగూడెం పరిసర ప్రాంతంలోని పలు వార్డుల లో, (డివిజన్) లలో పంచాయతీలలో, మిషన్ భగీరథ పేరిట తవ్వకాలు చేపట్టి ప్రజలకు,ఆటంకం కలిగిస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనదారులు ఆదమరిస్తే చాలు పాతాళానికి పోవాల్సిందే. కొన్ని నెలలుగా ఈ మిషన్ భగీరథ పనులను జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి.వీటికి పలు రకాల మరమ్మత్తులు సైతం చేస్తున్నారు ఇది హర్షించదగినటువంటి విషయమే.ప్రజలకు మిషన్ భగీరథ పేరిట నీళ్లను అందిస్తున్నటువంటి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
కానీ ఇదే అదునుగా ఎక్కడపడితే అక్కడ కాలువల తవ్వేసి పైప్లైన్ వేసి,అవి పూడ్చి పూడ్చినట్టుగా, అలా వదిలేసి ప్రజలను ఇబ్బందుల కు గురించేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ప్రతి వీధిలో స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొత్త గా,సిమెంట్ రోడ్లను వేసిన తరుణంలో మరల వాటిని పెకిలించి కిన్నెరసాని లేదా భగీరథ పేరిట తవ్వకాలు చేపట్టి,ఆ మార్గాన్ని పూర్తిగా ధ్వంసం చేసి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. ఒకరు సిమెంట్ రోడ్లు వేస్తే, మరొకరు, వాటిపైన పైపులను అమర్చి మరల రోడ్లు వేయకుండా అలా గాలికి వదిలేస్తున్నారు, ప్రజా సేవే మా ద్యేయం అని చెప్పుకుంటున్న నాయకులు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఉండటం ఎంతవరకు స మంజసం అంటున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడటం,ఎంతవరకు సమంజసం అంటున్నారు స్థానికులు.
మమేకమై పరిపాలన సాగించాలని,ప్రజల పట్ల అంకిత భావం,ప్రజల ఆరోగ్యాలకు రక్షణ లేక వాటి ని ఇలా గాలికి వదిలేస్తున్నారని వాపోతున్నారు. జెసిబి లతో త్రవ్వకాలు చేపట్టి నేషనల్ హైవేకి ఇరువైపులా ఫుట్ పాతూ లను, సైతం పెకిలించి ఆ ప్రాంతంలో పైపులను అమర్చి కాలినడకన బాట లేకుండా చేస్తున్నారు. దీనిపై పాదాచార్యులు గట్టిగా మండి పడుతున్నారు. ఇక జాతీయ రహదారికి ఇరువైపులా కాలువలు సైతం లేక, దుకాణాంతారులు నాన దుకాణాందారులు నాన ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నేషనల్ హైవేపై డ్రైనేజీ లేక రాంపురం పట్ట ణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని నేషనల్ హైవే సిబ్బంది ఆర్ అండ్ బి సిబ్బంది, మునిసిపల్ అధికారులు మాత్రం ముక్కు పిండి పన్నులు వసూలు చేయడం అత్యంత దారుణమైన పరిస్థితి అనే పాఠకు లు ఆరోపిస్తున్నారు.
ఫుట్పాతుల పక్కన ఉన్నటువంటి డ్రైనేజీలు నీటి సరఫరా లేక అత్యంత దారుణమైన దుర్గంధం వెదజల్లే ప్రజలను రోగాల పాలు చేయడం ఇది ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు ప్రజలు. ఇలాంటి తరుణంలో వాటిని పట్టించుకునే నాధుడే లేడు. కాలినడకబాటపై పైపులైన్లు అమర్చడం ఏమిటని స్థానికులు పత్రికముకంగా ప్రశ్నిస్తున్నారు. రోడ్డు కిరువైపులా,పైపులైను అమర్చి వారి దారిన వారు వెళ్ళిపోతున్నారు. పాదాచారులు, రోడ్డుపై నడిస్తే పలు యాక్సిడెంట్లు జరిగే అవకాశం లేకపోలేదు.
మిషన్ భగీరథ పేరిట కోట్ల రూపాయలు దండుకుంటున్నారు,అని ఆరోపణలు కూడా లేకపోలేదు. దీనిపై సంబం ధిత అధికారులు ఏఈ డి ఈ, స్ ఈ,లు ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.సంస్థ రోడ్డుకి ఇరువైపుల ఉన్న ఫుట్ పాత్ తిరిగి ఎవరు పునరుద్ధరించాలి. ప్రజాధనాన్ని వృధా చేయడమంటే ఇది కాదా అని ప్రశ్నిస్తున్నారు పాఠకులు. ఒకవైపు రోడ్ల మరమ్మ త్తులు లేక గుంతలతో నిండిపోయి నిత్యం ఎక్కడో ఒక దగ్గర ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది.ఇలాంటి సంఘటన నిత్యం మనకు కనిపిస్తున్నాయి.
ఇకనైనా ఈ భగీరథ పనులను సరైన సమయంలో పూర్తిచేసి ప్రజలకు ఎటువంటి ఇక్కట్లు కలగకుండా చూడాలి. వీలైనంత త్వరగా, పూర్తి చేసి వాటిని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నారు ప్రజలు.