28-07-2025 07:47:09 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): రేకుర్తిలో స్వయంభుగా వెలిసిన శ్రీ సుదర్శన చక్రం గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సోమవారం రోజున దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) పాల్గొన్నారు. తదుపరి ఎమ్మెల్యే మాట్లాడుతూ... స్వామి అనుగ్రహంతో ఆలయ నిర్మాణాన్ని తుది దశ వరకు చేసే భాగ్యం నాకు ఆ భగవంతుడు ప్రసాదించాడని ఆలయ నిర్మాణంలో భాగంగా మిగిలి ఉన్న పనులను కూడా అతి త్వరలో పూర్తి చేసి కరీంనగర్ నుండి కాకుండా, ఇతర ప్రదేశాల నుండి వచ్చే భక్తులకు వీలుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో సకల వసతులు ఏర్పాటు చేస్తామని అన్నారు. వారి వెంట మాజీ కార్పొరేటర్లు 18వ డివిజన్ సుధగోని మాధవి-కృష్ణగౌడ్, 19వ డివిజన్ కార్పోరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ మజీద్, రేగుల ఎల్లయ్య, నేరేళ్ల అజయ్, మహష్, గరిగంటి నర్సింగం,ప్రభాకర్,వెంకటి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.