calender_icon.png 29 July, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్గాపూర్ లో రేపు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన

28-07-2025 07:48:36 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రేపు 29న రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఉంటుందని మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఉద్యానవన శాఖ అధికారులు ఆయిల్ ఫామ్ పంట సాగు చేసేందుకు రైతులకు తగుసూచనలు, సలహాలు ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.