calender_icon.png 29 July, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన

28-07-2025 07:53:38 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై సోమవారం లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్(Lead Bank Manager Ram Gopal) అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని తమ తల్లిదండ్రులకు బ్యాంకు లావాదేవీలు అక్షరాస్యతపై ఆసక్తి పెంచాలని సూచించారు. డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న అక్రమాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు బ్యాంకుల్లో పొదుపు ఖాతాలను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజమౌళి పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.