calender_icon.png 24 May, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవ అనుగ్రహం అందరిపై ఉండాలి

24-05-2025 06:18:36 PM

బుద్ధారం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..

హన్వాడ: మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో బొడ్రాయి పండుగ, నాగ నాభిశిల, గ్రామ దేవతల పునః ప్రతిష్టపనను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

బొడ్రాయి ప్రతిష్ఠాపనలో వివిధ ప్రాంతాల నుంచి ఆడపడుచులు వచ్చి సంబరంగా వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలు పండేలా చూడాలని గ్రామ దేవతలను మొక్కుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ నరేందర్, సీనియర్ నాయకులు కొండా లక్ష్మయ్య, శ్రీనివాసులు, బసి రెడ్డి, జంబూలయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.