calender_icon.png 15 November, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీలో కెమికల్స్ వదిలిన కేంద్రం వద్ద నేతల ఆందోళన

01-12-2024 01:57:30 AM

రాజేంద్రనగర్, నవంబర్30: మూసీ నదిలో కెమికల్ వ్యర్థాల పారబోత వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన రోజు హడావిడి చేసిన నేతలు ఆ తర్వాత సైలెంట్ మోడ్‌లోకి జారుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో లంగర్‌హౌస్‌కు చెందిన పలువురు నాయకులు, అయ్యప్ప భక్తులు శనివారం సంబంధింత బిల్డింగ్ మెటీరి యల్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.

ఇంత సీరియస్ ఘటన జరిగినా సం బంధిత కేంద్రాన్ని సీజ్ చేయకపోవడం ఏం టని వారు ప్రశ్నించారు. సంబంధిత కేంద్రాన్ని వెంటనే సీజ్ చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకొని నేతలను సముదా యించారు. రెండు రోజుల్లో కేంద్రంలో ఉన్న మెటీరియల్ మొత్తాన్ని తొలగించాలని ఆ వెంటనే కేంద్రాన్ని సీజ్ చేస్తామని ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో సంబంధిత నిర్వాహకులకు తెలిపారు.

ఇదే విషయం ఆందోళన చేసే నేతలకు కూడా చెప్పడంతో వారంతా శాంతిం చారు. అయితే బిల్డింగ్ మెటీరియల్ విక్రయ కేంద్రం నిర్వాహకులు భారీగా ప్రభుత్వ స్థలా న్ని కబ్జా చేసినట్లు తెలుస్తోంది. మెటీరియల్ కేంద్రాన్ని సీజ్ చేయడంతో పాటు వారు ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.