calender_icon.png 5 July, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీసీ బొల్లారం యూనిట్‌లో బీఆర్టీయూ విజయం

05-07-2025 12:00:00 AM

పటాన్చెరు, జూలై 4: ఐటీసీ బొల్లారం యూనిట్ చరిత్రలోనే బీఆర్టీయు గెలుపు మైలురాయిగా నిలుస్తుందని బీఆర్టీయు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎస్.రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాంబశివరావు తెలిపారు. బొల్లారం ఐటీసీ యూనిట్కు జరిగిన ఎన్నికల్లో బీఆర్టీయు విజయకేతనం ఎగురవేసింది. గత వేతన ఒప్పందంలో యాజమాన్యానికి కొమ్ము కాసిన ఐఎన్టీయుసీ  యూనియన్ చావుదెబ్బ కొట్టిన బొల్లారం కార్మికులు వారికి జరిగిన అన్యాయాన్ని తమ ఓటుతో జవాబిచ్చారని తెలిపారు.

అహర్నిశలు శ్రమించి కార్మికుల పక్షానే ఉంటూ, సమస్యలను లేవనెత్తి పరిష్కరించే దిశలో బీఆర్టీయు  యూనియన్ ని గెలిపించిన ప్రతి కార్మికుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కార్మికుల విజయమని, ఈ విజయంతో తమ బాధ్యత మరింత పెంచారని, కచ్చితంగా కార్మికుల పక్షాన నిలిచి వారి సంక్షేమానికి పాటుపడతామని తెలిపారు.