calender_icon.png 6 May, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో బీఎస్‌ఎఫ్ జవాన్ దుర్మరణం

06-05-2025 01:05:51 AM

మహబూ బాబాద్, మే 5 (విజయ క్రాంతి): సెలవుల కోసం ఇంటికి వచ్చిన బిఎస్‌ఎఫ్ జవాన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలన ఘటన మహబూబా బాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జరిగింది. ఇది జిల్లా గంగారం మండలం అందుగుల గూడెం గ్రామానికి చెందిన మద్దెల ప్రకాష్ జమ్మూకాశ్మీర్లో బిఎస్‌ఎఫ్ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు.

సెలవుల కోసం ఐదు రోజుల క్రితం ఇంటికి వచ్చిన ప్రకాష్ తమ సమీప బంధువుల ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే వరంగల్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడ ఎస్‌ఐ కుష కుమార్ తెలిపారు.