06-05-2025 01:05:57 AM
రాజేంద్రనగర్, మే 5: గ్రామీణ పారిశ్రామికవేత్తలను సాధికారత దిశగా ప్రోత్సహిం చడమే లక్ష్యమని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్గరీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేం ద్రాన్ని కలిగి ఉన్న హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూ ట్ ప్రధాన కార్యాలయం కన్హాశాంతివ నం లో ఆ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపక అధ్యక్షులు కమలేశ్ పటేల్ (దాజీ), పేపాల్ సీని యర్ డైరెక్టర్ శ్రీనాథ్ పరమేశ్వరన్ ఆధ్వర్యం లో సోమవారం ఆయన బయోచార్ సెంట ర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు.
హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్, పేపాల్ సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు. గ్రామీణప్రాంత పారిశ్రామికవేత్తలకు బయోచా ర్‌ను తయారుచేసే నైపుణ్యాన్ని అందించడానికి ఈ కేంద్రన్ని స్థాపించినట్టు కేంద్రమంత్రి పేర్కొన్నారు. మహిళలు, యువ పారిశ్రామికవేత్తలను బయోచార్ యూనిట్లను ఏర్పా టు చేయడానికి, బయోచార్‌ను ఉత్పత్తి చే యడానికి, గ్రామీణ వ్యాపార నమూనాలో భాగంగా రైతులకు పంపిణీ చేయడానికి ప్రో త్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు.