calender_icon.png 17 November, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భలే బబుల్స్..

09-03-2025 12:00:00 AM

బుడగలు అంటే ఇష్టపడని పిల్లలెవరైనా ఉంటారా.. అందుకే బెలూన్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెరైటీలు వస్తూనే ఉంటాయి. అలా ఈమధ్య బబుల్ బ్లోయింగ్ టాయ్స్ వచ్చేశాయి. చిన్న ట్యూబ్, సన్నని స్ట్రా పైప్స్‌తో ఉండే ఈ కిట్‌లో ట్యూబ్‌లోని ఫోమ్ గ్లూని తీసి రెండువైపులా రంధ్రాలుండే స్ట్రా ముక్కకి ఒకవైపు ఉంచాలి. ఆ తర్వాత రెండో వైపు నుంచి నోటితో గాలిని ఊదితే చాలు, ముందువైపు బెలూన్ తయారైపోతుంది. బర్త్ డే వేడుకల్లో, సెలవుల్లో పిల్లలకు దీన్ని ఇచ్చారంటే.. బుడగలతో ఆడుకోవడం కన్నా సరదాగా వాటిని తయారుచేస్తూనే సంబరపడిపోతుంటారు.