calender_icon.png 17 November, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది భయకరమైన రోడ్డు!

09-03-2025 12:00:00 AM

హాయ్ ఫ్రెండ్స్.. ఈ కొండ గురించి తెలుసా? ఎవరో డిజైన్ చేసినట్టు ఉన్న ఈ గీతలు కొండ రోడ్డు మార్గం.. ఇది అతి భయంకరమైన రోడ్డుగా చెబుతుంటారు పర్యాటకులు. ఈ కొండ ఎక్కడ ఉంది? దాని విశేషాలేంటో తెలుసుకుందామా..

కొండ మీద గీతల్లా కనిపిస్తున్నది.. దానిపైకి ఎక్కడానికి ఉన్న రోడ్డు మార్గం.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. అదే నిజం. ఈ రోడ్డు టర్కీలోని బేబర్ట్ ప్రాంతంలో ఉంది. దీన్ని ‘డీ915 రోడ్డు’ అని పిలుస్తారు. ప్రపంచంలోని చాలా భయంకరమైన రోడ్లలో ఇదొకటి. మరో విషయం ఏంటంటే.. ఒకేసారి రెండు వాహనాలు పక్కపక్కన వెళ్లలేనంత సన్నగా ఉంటుందట. అందుకే మనకు.. అది చిన్న గీతలా కనిపిస్తున్నది. దాదాపు 105 కిలోమీటర్ల పొడవైన ఆ దారిలో 13 టర్నింగ్స్ ఉన్నాయి. సాహసాలు చేయడానికి ఇష్టపడే వాళ్లే ఎక్కువగా ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తారట.