calender_icon.png 19 May, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ్యూజియంలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి

19-05-2025 12:00:00 AM

డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ మణికొండ

ముషీరాబాద్, మే 18 (విజయ క్రాంతి) : అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ డిపార్టు మెంట్, సివిల్ సొసైటీ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని గన్ఫౌండ్రీలోని సెంటినరి హెరిటేజ్ మ్యూజియంలో ఎ మ్యూజియం డే వాక్ నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి స్వాగతం పలికారు. వేదకుమార్ మణికొండ చైర్మన్ డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు మాట్లాడుతూ ప్రపంచంలోనే నేషనల్ మ్యూజియం అతి ఉత్తమ మైనదన్నారు.

కుతుబ్షాహి పీరియడ్, అజప్షాహి పీరియడ్ల వరకు మ్యూజియంలకు ప్రాముఖ్యత ఇచ్చారని గుర్తుచేశారు. హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియం ప్రపం చలోనే గొప్ప మ్యూజియం అని అన్నారు. బోధన్, కామారెడ్డి ప్రాంతాల్లోని తాను పర్యటించి, స్థానికులను అడిగి, అక్కడి చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను తెలుసుకొని, ఒక ప్రాజెక్టును రూపొందించానని ఈ సంధర్భంగా తెలిపారు. మ్యూజియంలోని పురా తన వస్తువులను ప్రదర్శిస్తూ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఓయూ, ఆర్కిటెక్ట్ కాలెజ్ విద్యార్థులు, ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ ద్యావనపల్లి సత్యనారాయణ, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ అర్కియాలజీ బాబ్జీ రావు, చరిత్రకారులు సంగనభట్ల నర్సయ్య, శ్యాంసుందర్, స్తపతి శ్యాంసుందర్, అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అర్కియాలజి కె.రూపి, సూపరిటెండెంట్ రాజు, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు కో-ఆర్డినేటర్ ప్రభాకర్, ఇన్చార్జి ఖైదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.