15-11-2025 12:00:00 AM
కుప్పకూలిన సౌతాఫ్రికా
కోల్‌కత్తా, నవంబర్ 14 : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో కీలకమైన సిరీస్‌ను భారత్ కాన్ఫిడెంట్‌గా ప్రారంభించింది. ఈ డెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మొదటిరోజు టీమిండియా పైచేయి సాధించింది. స్టార్ పేసర్ జస్ప్రీ త్ బుమ్రా చెలరేగిన వేళ సౌతాఫ్రికా కుప్పకూలింది. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు అనుభవం లేని సఫా రీ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు.
బుమ్రా (5/27)కు తోడు సిరాజ్ (2/47), కుల్దీప్ యాదవ్ (2/36) కూడా రాణించడంతో సౌతాఫ్రికా కోలుకోలేకపోయింది. టాస్ ఓడిపోవడం మరోసారి భారత కెప్టెన్ శుభమన్ గిల్‌కు బాగానే కలిసొచ్చింది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో సంచలన నిర్ణయాలు జరిగాయి. కోచ్ గంభీర్ మూడో స్థానం బ్యాటర్ సాయిసుదర్శన్‌ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుంద ర్‌కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చాడు.
అలాగే ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లతో బరిలోకి దిగడం కూడా విమర్శలకు దారిసింది. ఇదిలా ఉంటే తమ బ్యాటర్లపై నమ్మకంతో బ్యాటింగ్ ఎంచుకున్న బవుమాకు ఆ ఆనందం కొద్దిసేపే నిలిచింది. ఓపెనర్లు ధాటిగా ఆడుతూ 10 ఓవర్లకే 57/0 స్కోర్ చేయడంతో భారీస్కోర్ ఖాయమనుకున్నారు. అయితే బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు.
ఇక్కడ నుంచి దక్షిణాఫ్రికా క్రమం తప్పకుండా అది కూడా వేగంగా వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ వరకూ సౌతాఫ్రికా 105/3 స్కోర్‌తో బాగానే కనిపించినా.. ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఒక ఎండ్‌లో కుల్దీప్ యాదవ్, మరొక ఎండ్‌లో బుమ్రాకు తోడుగా సిరాజ్ కూడా రెచ్చిపోవడంతో సఫారీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మూడో సెషన్ ఆరంభంలోనే సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 159 పరుగులకు ముగి సింది.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్ రమ్ 31 (5 ఫోర్లు,1 సిక్స్) మల్దర్ 24 (3 ఫోర్లు), రికెల్టన్ (23), జోర్జి (24) పర్వాలేదనిపించారు. సఫారీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. ఇదిలా ఉంటే కెరీర్‌లో 16వ సారి బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అలాగే ఈడెన్ గార్డెన్స్‌లో ఇశాంత్ శర్మ తర్వాత అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.
తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. కేవలం 12 పరుగులకే వెనుదిరిగాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానానికి ప్రమోట్ అయిన వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా జిడ్డు బ్యాటింగ్ చేశారు. వెలుతురు లేమి కారణంగా తొలిరోజు ఆట త్వరగానే ముగిసింది. ఆటముగిసే సమయానికి భారత్ 1 వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసింది.కేఎల్ రాహుల్ 13 (2 ఫోర్లు) , వాషింగ్టన్ సుందర్ 6 రన్స్ తో క్రీజులో ఉన్నారు.
స్కోర్లు :
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159 ఆలౌట్ (మార్క్ రమ్ 31 ,మల్దర్ 24 రికెల్టన్ 23, జోర్జి 24; బుమ్రా 5/27, సిరాజ్ 2/47, కుల్దీప్ 2/36)
భారత్ తొలి ఇన్నింగ్స్ : 37/1 (రాహుల్ 13 బ్యాటింగ్, జైస్వాల్ 12, వాషింగ్టన్ సుందర్ 6 బ్యాటింగ్; మార్కో జెన్సన్ 1/11)